KTR: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై.. స్పందించిన కేటీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ (KTR) స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోధ ఆసుపత్రి (Somajiguda Yashoda Hospital)లో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్ (Blood sugar) , సోడియం, స్థాయులు పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు (Doctors) సూచించినట్టు చెప్పారు. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ క్షేమం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.