తెలంగాణ భవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.