ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో సాంకేతిక కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌లను వరుసగా ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత విశ్వసనీయ కేంద్రంగా ఉంది. అన్ని రంగాల్లో అనుకూలతల దృష్ట్యా ప్రపంచంలోని ప్రముఖ ప్రపంచ సమాచార సేవల సంస్థ ఎక్స్పీరియన్ తదితర దిగ్గజ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. హైదరాబాద్‌ను వినూత్న ఐటీ హబ్‌గా మార్చడంలో ఎక్స్పీరియన్ ఆవిష్కరణల కేంద్రం సహాయపడుతుంది. సాంకేతికత, విశ్లేషణలు, ఆవిష్కరణల సహాయంతో వ్యాపార, ఆర్థిక, వినియోగ వ్యవస్థలు బలోపేతమవుతాయి. ఈ సంస్థలకు తెలంగాణ అన్ని విధాల చేయూతనిస్తుందని తెలిపారు.






