Allu Aarjun : అల్లు అర్జున్ వ్యవహారంపై మరోసారి స్పందించిన కేటీఆర్

సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Aarjun) వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr )మరోసారి స్పందించారు. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అలా మాట్లాడారని పేర్కొన్నారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సెటిల్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల (Auto drivers) కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. రైతన్నలు, నేతన్నల మరణాలపైనా సీఎం స్పందించాలన్నారు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.