ఒకే రోజు 53 సంస్థలతో తెలంగాణ ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోంది. వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైపుణ్య, విజ్ఞాన సంస్థ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ టాస్క్) పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. టాస్క్ చరిత్రలో ఇది మైలురాయి అని, యువతకు ఉపాధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడిరచారు. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణపై టాస్క సీఈవో శ్రీకాంత్ సిన్హా ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్అండ్టీ మెట్రోరైలు, భారత ఫోర్జ్, కల్యాణి రాఫెల్, 27/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్, స్ప్రింగ్‌బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్ హెల్డ్ హైలు ఉన్నాయి. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి లక్ష్యంగా టాస్క్‌ను నెలకొల్పాం. దీని కింద వివిధ విభాగాలకు చెందిన 718 కళాశాలలు నమోదు చేసుకున్నాయి. గత 8 ఏళ్లలో 6,53,189 మంది విద్యార్థులకు, శిక్షణ నైపుణ్యాలను అందించింది. 14,338 మంది శిక్షకులు కూడా నైపుణ్యాభివృద్ధి వృద్ధి చేసుకున్నారు. టాస్క్‌ను హైదరాబాద్ వరకే కాకుండా ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల వరంగల్‌కు విస్తరించాం. నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి పట్టణాలకు విస్తరిస్తాం అని తెలిపారు.






