KTR: హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అనారోగ్యంతో ఉన్న హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగినట్టు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇటీవల ఖండిరచిన హరీశ్‌రావు, అధినేత కేసీఆర్ (KCR) మాట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికీ తాను సహకరిస్తానని చెప్పారు. తనపై కుట్రలు చేస్తున్నారని సమయం వచ్చినప్పుడు బయటపెడాతనని ఎమ్మెల్సీ కవిత (mlc kavita) ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావుల భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది.