Minister Seethakka : సీఎం రేవంత్ సవాల్ కేటీఆర్‌కు కాదు, కేసీఆర్‌కు : మంత్రి సీతక్క

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు అర్థం కానట్టుందని రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరింది కేటీఆర్‌కు కాదని, కెసిఆర్ (KCR) కు అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్ చర్చకు రావాలన్నారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే చచ్చిపోయిందని, కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగీకరించడం లేదన్నారు. కేటీఆర్ తమ నాయకుడే కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సీతక్క పేర్కొన్నారు.