KTR: ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా : కేటీఆర్

కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో నిజం నిలకడగా తేలుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్టు చేస్తున్నారని విమర్శించారు. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి, ఇప్పుడు నోటీసులు (Notices) ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అపరిచితుడిలా ఉన్నారు. అప్పు పుట్టలేదని రెమో అంటారు. రూ.లక్షా 60 వేల కోట్లు రాము అప్పు చేశారు. ఉన్న డిక్లరేషన్లకే దిక్కు లేదు. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ ఎందుకు? నెల రోజులుగా సీఎం మదిలో ఉన్నవి వరల్డ్ బ్యూటీస్ (World Beauties) , కేసీఆర్ (KCR)కు నోటీసులు. మేము కట్టిన వాటి ముందు వరల్డ్ బ్యూటీస్ ఫొటోలు దిగుతున్నారు అని అన్నారు.