KTR : కావాలంటే ఆయన ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) ఘటనలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నాని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సీఎం వ్యవహార శైలి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు ఆగిన ప్రాజెక్టు (Project) ను జాగ్రత్తలు తీసుకోకుండా, నిపుణుల (Expert)ను సంప్రదించకుండా ప్రారంభించారు. అవినీతి సొమ్ము కోసం పాత యంత్రాలతో పనులు చేపట్టారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధనదాహం వల్లే టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నారు. కావాలంటే ఆయన ఎలాంటి విచారణలైనా చేసుకోవచ్చు అని అన్నారు.