KTR: నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం : కేటీఆర్

నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు . బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు (Kaleshwaram Commission Notices) ఇవ్వడంపై ఆయన స్పందించారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికొదిలి ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాపాలన, కమీషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయతీ ఎప్పటికీ ఓడిపోదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) కూలి చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదు. నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది. ఇప్పటికీ చర్యల్లేవు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది. రూ.4 వేల పింఛన్ల మాట ఏమైంది అని ప్రశ్నించారు.