KTR: అసెంబ్లీలో చర్చిద్దామంటే… రేవంత్ పారిపోయారు : కేటీఆర్

ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయన్ను 8 గంటలపాటు ప్రశ్నించారు. కేటీఆర్ సెల్‌ఫోన్ (Cellphone)ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్‌ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ- రేసు సమయంలో వాడిన సెల్‌ఫోన్లను అప్పగించాలని కేటీఆర్‌ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18లోపు సెల్‌ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్ రేసింగ్ (Car racing) పై అసెంబ్లీ (Assembly)లో చర్చిద్దామంటే, రేవంత్ (Revanth) పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పినా పత్తాలేరు. ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్ప అడిగారు. అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులనే అడిగాను. పై నుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది. రేవంత్ జైలు కెళ్లారు. మమ్మల్నీ జైల్లోపెట్టి పైశాచిక అనందం పొందాలని చూస్తున్నారు. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా. వందల కొద్ది కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడను అని అన్నారు.