కొరియా షూ సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ .. రూ.300 కోట్లతో

కొరియాకు చెందిన ప్రముఖ షూఆల్స్ షూ కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. షూఆల్స్ సంస్థ మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక బూట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలుకొల్పుతామని ఆ సంస్థ ప్రతినిధులు కోరారని ఆయన వెల్లడిరచారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కే గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను సంస్థ చైర్మన్ చెవోంగ్ లీతో పాటు ప్రతినిధులు మంత్రి ముందు ఉంచారు. అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పరిశోధన, బయోమెడికల్ కేంద్రాలు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ హెల్త్ సిటీ నెలకొల్పుతామని, దీనిద్వారా లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని కొరియా బృందం ప్రతిపాదన చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.