Kaleshwaram: కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ : మంత్రి కోమటిరెడ్డి

కాళేశ్వరం కథ త్వరలోనే అందరికి తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రీడిజైనింగ్ (Redesigning) పేరుతో కాళేశ్వరం(Kaleshwaram) చేపట్టి మోసం చేశారన్నారు. తెలివున్న వారెవరైనా కాళేశ్వరం చేపడతారా? మేడిగడ్డ (Medigadda) కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ (NDSA) నివేదిక ఇచ్చింది. వాటిలో నీళ్లు నింపితే ఈపాటికే మొత్తం కొట్టుకుపోయేది. ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మిడిహట్టి సరైన ప్రాంతమని ఇంజినీర్లు చెప్పారు. తుమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుందని పక్కన పెటారు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.