Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

పార్టీలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎస్పీఆర్ హిల్స్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) , మేయర్ విజయలక్ష్మి (Vijayalakshmi), స్థానిక ప్రజాప్రతినిధులు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి (Ashok Reddy)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే పదవులు, రాజకీయ పార్టీలు శాశ్వతం కాదన్నారు. హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం చెబుతోందన్నారు. మెట్రో డీపీఆర్ (Metro DPR )ను పూర్తిస్థాయిలో కేంద్రానికి పంపలేదని, సమగ్రంగా పంపిస్తే ఆలోచిస్తుందని చెప్పారు. ప్రజలకు ఎలా మేలు చేస్తున్నామనేది నేతలు ఆలోచించాలని తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.