Kishan Reddy: ఘనంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం : కిషన్ రెడ్డి

నిజామాబాద్ ప్రాంత రైతులకు పసుపు బోర్డు బహుమతి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నిజామాబాద్ (Nizamabad)లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) కి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.