Kishan Reddy: తెలంగాణలో వేగంగా రైల్వేల అభివృద్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బేగంపేట (Begumpet), కరీంనగర్ (Karimnagar), వరంగల్ (Warangal)లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్రణాళికలు చేస్తున్నాం. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ (Komuravelli Railway Station) ను ప్రారంభిస్తాం. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ (Prime Minister Modi ) ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు.