Kishan Reddy : తాను అడ్డుకున్నట్లు సీఎం రేవంత్ నిరూపించాలి : కిషన్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్(Cabinet) వద్దకు వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఢల్లీిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణకి సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పారా? అని నిలదీశారు.