Bhatti Vikramarka: వారు సభకు ఎందుకు రావట్లేదు? : భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ సభ్యులకు ఇబ్బంది అయిన రోజున శాసనసభ (Legislative Assembl) నుంచి వాకౌట్ చేశారు. సరే మిగతా రోజుల్లోనూ వారు సభకు ఎందుకు రావట్లేదు? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పథకాన్ని నిర్వీర్యం చేయడంపై చర్చ వారికి ముఖ్యం కాదా అని నిలదీశారు. శాసనసభలో అన్ని అంశాలపైనా చర్చించాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ పట్టు పట్టిందని, వారి కోరిక మేరకు తాము అన్ని అంశాలపైనా చర్చ పెడుతున్నామని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డిపైన చర్చ పెడితే వారు పారిపోయారన్నారు. సభ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు.






