KCR: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మాజీ సీఎం కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) సోమాజిగూడ యశోద ఆసుపత్రి (Yashoda Hospital) నుంచి డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం (Thursday) ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్ (Blood sugar) , సోడియం స్థాయులు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నందిగనర్ (Nandiganar)లోని నివాసానికి వెళ్లారు. వారం రోజల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. తర్వాత మళ్లీ పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం గురు, శుక్రవారాల్లో మరోసారి కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు.