హుజూరాబాద్‍లో కాంగ్రెస్‌దే విజయం… కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్‍లో కాంగ్రెస్‍దే విజయమని కేటీఆర్‍తోనూ చెప్పానని హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‍రెడ్డి తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్‍ను కౌశిక్‍రెడ్డి కలవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కౌశిక్‍రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్‍ఎస్ తనను ఆహ్వానించిందనటం అవాస్తమని తెలిపారు. టీఆర్‍ఎస్‍లోకి వెళ్లనని, కాంగ్రెస్‍లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‍లో కాంగ్రెస్ నుంచే పోటీ చేశానని, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. కేటీఆర్ కలిసినంత మాత్రాన టీఆర్‍ఎస్‍లోకి వెళ్లనని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. టీఆర్‍ఎస్ గురించి ఈటల రెండేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.