Kalvakuntla Kavitha:బీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి: కల్వకుంట్ల కవిత రాజీనామా

బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ను మండలి చైర్మన్ (Chairman) కు పంపించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ (MLC) పదవితో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా (Resignation) చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ క్రమశిక్షణ వ్యవహరాల బాధ్యులు సోమ భరత్‌కుమార్ (Soma Bharathkumar) , పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రావు (T. Ravinder Rao) వెల్లడించారు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.