కగూల్ హైదరాబాద్ కేంద్రం విస్తరణ
బ్రిటన్‌కు చెందిన డాటా అనలిస్ట్, కన్సల్టెన్సీ సంస్థ కగూల్ హైదరాబాద్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. నానక్‌రామ్ గూడలోని కపిల్ టవర్స్‌లో 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్‌ను గ్రూపు సీఈవో డ్యానో బార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా ఈ నూతన ఆఫీస్‌ను తీర్చిదిద్దినట్లు, భారతలో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ఢోకా లేదన్నారు. దేశీయ వ్యాపార వ్యూహాత్మక విస్తరణలో భాగంగా వచ్చే మూడేండ్ల కాలంలో 8 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 2025 నాటికి 2,500 మంది సిబ్బంది కలిగిన సంస్థను తీర్చిదిద్దడానికి వచ్చే నెల మొదట్లో పుణెలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.






