Maganti Gopinath: అధికారుల లాంచనాలతో మాగంటి అంత్యక్రియలు!

బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్ర స్థానంలో ప్రభుత్వ అధి కారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన, ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతి తో జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అంతి మ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు.
అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో కేటీఆర్, హరీశ్ రావు తదితరులు పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పిం చారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు.
– జి.సురేందర్