Ponguleti : తొలి విడతలో అత్యంత పేదవారికి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి

పటిష్ఠమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులదేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భూభారతి (Bhubharati) అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రతి అధికారి కూడా రైతు కుటుంబం నుంచే వచ్చినవారే ఉంటారు. వారి కష్టాలు తెలుసు కాబట్టి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా సమస్య పరిష్కరించాలి. ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో అత్యంత పేదవారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. విడతల వారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indirammas house) మంజూరు చేస్తాం అని అన్నారు.