India Justice Report: తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానం

ఇండియా జస్టిస్ రిపోర్ట్ (India Justice Report) – 2025 లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోలీసు అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ని కలిసి ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లోని అంశాలను వివరించారు.