IAS :తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ (IAS)లను బదిలీ చేసింది. 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కొత్త స్థానాల్లో నియమించింది. కీలక మైన జీహెచ్‌ఎంసీ కమిషన్‌గా ఉన్న ఇలంబర్తి (Ilambarthi)ని హెచ్‌ఎండీఏ పరిధిలోపల ప్రాంతాలకు పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఇంతకాలం పురపాలక శాఖ పరిపాలనా కమిషనర్‌గా ఉన్న టీకే శ్రీదేవి (TK Sridevi)ని ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాలకు అదే పదవిలో అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్‌ఎండీఏ పరిధి వెలుపల ఉన్న ప్రాంతాలకు పురపాలక శాఖ కార్యదర్శి రెగ్యులర్ పోస్టులో నియమించింది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లుగా అభివృద్ధి చేస్తున్నందున వీటికి ఉపాధి శిక్షణ కమిషనర్‌గా దానకిశోర్ (Danakishore)కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
అధికారి పేరు బదిలీ అయిన స్థానం
ఆర్వీ కర్ణన్- జీహెచ్‌ఎంసీ కమిషనర్
సంగీత సత్యనారాయణ- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
ఇలంబర్తి – పట్టణాభివృద్ధి కార్యదర్శి ( హెచ్‌ఎండీఏ పరిధి)
టీకే శ్రీదేవి- పట్టణాభివృద్ధి కార్యదర్శి ( హెచ్‌ఎండీఏ వెలుపల)
స్మితా సభర్వాల్ – ఆర్థిక కమిషన్ వెంబర్ సెక్రటరీ
శశాంక్ గోయల్- గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్
కే.శశాంక – ప్యూచర్ సిటీ డెవలెప్‌మెంట్ అథారిటీ కమిషనర్
ఎస్. హరీశ్ జెన్‌కో – సీఎండీ
నిఖిల – మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో
ఎస్. వెంకటరావు – దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో
పి. కాత్వాయనీ దేవి – సెర్ప్ అదనపు సీఈవో
హెమంత్ సహదేవ్‌రావు – జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్
ఫణీంద్రారెడ్డి – టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ
కధిరవన్ – పంచాయతీ రాజ్ జాయింట్ కమిషనర్
విద్యా సాగర్ – ( నాన్ క్యాడర్ ) హైదరాబాద్ అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు)
ఉపేందర్ రెడ్డి – నాన్ క్వాడర్ హెచ్‌ఎండీఏ కార్యదర్శి