Konda Murali: ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) వ్యాఖ్యలపై ఉమ్ముడి వరంగల్ జిల్లా (Warangal District) ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికి తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది అని పేర్కొన్నారు.