Hydraa: ముందుగా ఆ పనిని మేం పూర్తి చేస్తాం : హైడ్రా కమిషనర్

ముంపు బాధితుల సమస్యలను హైడ్రా వెంటనే పరిష్కరిస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బుద్ధ భవన్ (Buddha Bhavan) లో హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని(Hydra Police Station Building) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌తో పాటు హైడ్రాకు సమకూర్చిన వాహనాలు (Vehicles), యంత్రాలను సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతూ ప్రజలు ఏ విభాగాన్ని సంప్రదించాలో తెలియని సమస్యల్ని హైడ్రా పరిష్కరిస్తోందని చెప్పారు. ఫలానా సమస్య మా పరిధిలోకి రాదు అని మేం గిరిగీసుకోలేదు. ఏ శాఖకు చెందిన విధి అయినా, ముందుగా ఆ పనిని మేం పూర్తి చేస్తున్నాం. హైడ్రా చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. హైడ్రా వల్ల చెరువులు (Ponds), నాలాల కబ్జాలు తగ్గిపోతున్నాయి అని అన్నారు.