Hyderabad: లండన్‌లో ప్రమాదం .. హైదరాబాద్ వాసుల దుర్మరణం
లండన్ (London ) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. వినాయక నిమజ్జనాని (Vinayaka Nimajjanam ) కి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య(Chaitanya) (23) ఉప్పల్‌కు చెందిన రిషితేజ (Rishiteja) ( 21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్నకుమారుడు చైతన్య. బీటెక్ (B.Tech) పూర్తి చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్ వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వీరి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.







