Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక .. నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ (Maganti Sunitha Gopinath) తొలి సెట్ నామినేషన్ (Nomination) వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 11న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.