Metro Rail :మెట్రో ప్రాజెక్టుకు మరో అరుదైన గౌరవం

హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) ప్రాజెక్ట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) మన మెట్రో ప్రాజెక్ట్‌పై అధ్యయన పత్రం ప్రచురించింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో సాధించిన విజయాలను కేస్ స్టడీ (Case Study )గా ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి మేటాస్ పతనం, భూసేకరణ సమస్యలు, రాజకీయ ఒడిదొడుకుల వంటి అనేక అడ్డంకులను అధిగమించి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన మెగా ప్రాజెక్ట్ (Mega project )గా అవతరించిందని హార్వర్డ్ అధ్యయన పత్రం (Harvard study paper )లో పేర్కొంది.