Miss World : సుందరాంగుల సందడి … మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Rajiv Gandhi International Airport) సందర్శించి, స్వాగత సత్కారాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మిస్ వరల్డ్ వేడుకలు (Miss World celebrations) వచ్చే సుందరీమణులు, ప్రతినిధులు, ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి స్వయంగా పర్యవేక్షించారు. జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్సీరియన్స్, పర్యాటక శాఖ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్‌ఎఫ్ అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయాన్ని మరింత అందంగా ముస్తాబు చేయాలని, పూలు, మామిడి, అరటి తోరణాలతో సుందరంగా అలంకరించాలని సూచించారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్‌ను త్వరగా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఎయిర్ పోర్టుకు విచ్చేసిన మిస్ ఇండియా నందిని గుప్తా(Nandini Gupta), మిస్ మెక్సికో మార్లే లీల్ పర్వాంతేస్ (Marley Lil Parvanthes)తో భేటీ అయ్యారు.