మంత్రి కొండా సురేఖకు కోర్టు ఆదేశం.. భవిష్యత్తులో

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియాలో తొలగించాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై రూ.100 కోట్లకు కేటీఆర్ దావా వేసిన విషయం తెలిసిందే.