BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఖరారు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి (Lanka Deepak Reddy) పేరు ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. 2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి (BJP candidate) గా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. ఆయన మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.