Supreme Court: సుప్రీంకోర్టులో తేలిన తర్వాత .. చూద్దామన్న హైకోర్టు

వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఆక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (Act Public Welfare Foundation ) ఈ పిల్‌ను దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act)లోని పలు సెక్షన్లను పిటిషన్‌లో సవాలు చేసింది. అయితే, వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోందని, అక్కడ తేలిన తర్వాత ఈ పిటిషన్‌ను పరిశీలిద్దామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.