Cabinet: మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడిరది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం (Sunday) మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) ఉండే అవకాశముంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురుకి మంత్రివర్గం లో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రివర్గ విస్తరణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంతనాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలి? సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) , సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు.