Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో బీజేపీ పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని వాసం వెంకటేశ్వర్లు (Venkateswarlu) ఫిర్యాదుతో ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టు (High Court)ను కోరారు. బహిరంగసభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారని తెలిపారు. జస్టిస్ కె.లక్ష్మణ్ (Justice K. Lakshman) ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.