Miss World : టీ హబ్ లో మిస్ వరల్డ్ సుందరీమణుల సందడి

హైదరాబాద్ నగర వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు కీలక దశకు చేరుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రదేశాలను సందర్శించి ఆనందించిన పోటీదారులు ఇప్పుడు కాంటినెంటల్ ఫినాలే (Continental Finale)లో పాల్గొంటున్నారు. 109 దేశాల ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. దీనిలో భాగంగా టి హబ్ (T Hub)లో మిస్ వరల్డ్ సుందరాంగులు సందడి చేశారు.
భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా (Nandini Gupta )కూడా పోటీ పడుతున్నారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న టి హబ్‌లో మంగళ, బుధవారాల్లో జరిగే కాంటినెంటల్ ఫినాలేలో ఆయా దేశాల సుదీరీమణులు పోటీపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం టీ హబ్‌ను ప్రపంచ సుందరీమణలు సందర్శించి సందడి చేశారు. ఈ పోటీల్లో భాగంగా అమెరికా (America) , కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా ఓషియానా క్లస్టర్ల నుంచి అంశాల వారీగా ఎంపిక ప్రారంభమూళిఐంది. సోమవారం నిర్వహించిన సెకండ్ రౌండ్ పోటీ నుంచి 48 మందిని ఎంపిక చేయగా నేపాల్, హైతీ, ఇండోనేషియా కంటెస్టెంట్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి చిట్టచివరి ఫలితాన్ని ఈ నెల 31న ప్రకటిస్తారు. ఈ నెల 31 అర్థరాత్రి వరకు ఈ పోటీలు కొనసాగి చివరి ఫలితం వెలువడుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.