Harish Rao: కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తాం : హరీశ్‌రావు

బీఆర్‌ఎస్ (BRS)లో ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ (KCR)కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. కేసీఆర్ తర్వాత కేటీఆర్ (KTR)కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తాం (Welcome). గతంలో కూడా ఈ అంశంపై చాలాసార్లు స్పష్టత ఇచ్చా. కార్యకర్తగా కేసీఆర్, పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తాం. కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు.