Harish Rao : ఆరు రోజులు గడిచినా.. వారి ఆచూకీ లేదు : హరీశ్‌రావు

ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel)లోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని ఇన్ని రోజులు రాలేదు. ఆరు రోజులు గడిచినా చిక్కుకుపోయినా వారి ఆచూకీపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎస్‌ఎల్‌బీసీ కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రూ.3,300 కోట్లు ఖర్చు పెడితే, బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం రూ.3,900 కోట్లు ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆక్రమంగా కృష్ణా జలాలు తరలించుకుపోతోంది. మన నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఆపటం లేదు. రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్ర బోర్డుకు అప్పగించేందుకు ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగీకరించలేదు. గోదావరిపై ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోరెత్తటం లేదు. కృష్ణా జలాలపై మేం నిలదీసిన తర్వాత కేఆర్‌ఎంబీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.