Harish Rao: రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా? : హరీశ్‌రావు

తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బనకచర్ల (Banakacharla) అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందంచడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశం లో హరీశ్‌రావు మాట్లాడుతూ నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశంలో బనకచర్ల అంశంపై ప్రధాని మోదీ (Modi) ని ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లయినా సరే బనకచర్లను ఆపుతాం. ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీకి కేంద్రం నిధులిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy ) లేఖలు రాసి చేతులు దులిపేస్తున్నారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు జరుగుతున్నా, అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లమన్నా స్పందించడం లేదు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను వెంటనే నిలిపివేయించాలి. బనకచర్లపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? గోదావరి జలాలపై తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోయే ప్రమాదముంది. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు పూర్తయిలే రోజుకు 90 వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి తీసుకెళ్తారు. అదే జరిగితే హైదరాబాద్‌కు తాగునీరు కూడా దక్కదు. కేఆర్‌ఎంబీ కళ్లు మూసుకుని ఏపీకి దాసోహమైంది అని ఆరోపించారు.