తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జర్మనీ బృందం

జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా జర్మనీ దేశంలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం తెలంగాణ శాసనసభను సందర్శించింది. అసెంబ్లీకి విచ్చేసిన రెని లాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్డ్రిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్మనీ బృంద సభ్యులకు పుష్పగుచ్ఛం అందించి శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.