Gali Janardhana Reddy: సీబీఐ కోర్టులో గాలి జనార్ధనరెడ్డి పిటిషన్

ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhana Reddy) నాంపల్లిలోని సీబీఐ కోర్టు (CBI court)లో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) లో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram mining case) లో గాలి జనార్దనరెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.