Telangana Rising: తెలంగాణ రైజింగ్ 2047కు…టోనీ బ్లెయిర్ ప్రశంస

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ (Tony Blair) లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising )-2047ను ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి ఆయనకు వివరించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఐటీ, ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో లక్ష్యాల గురించి ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ (Institute of Global Change) , తెలంగాణ మద్య అవగాహన ఒప్పందం కుదరగా, రైజింగ్ విజన్ రూపకల్పన అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఇరువైపుల ప్రతినిదులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047తనను ఆకట్టుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లెయిర్ ఈ విజన్‌కు సహకరిస్తామని తెలిపారు.