బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్టు

బీఆర్‌ఎస్‌కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ రాగనే పంజాగుట్టు పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజపరిచారు. న్యాయమూర్తి అతడికి ఈ నెల 22 వరకు (14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.