Bharat Summit: భారత్ సమ్మిట్‌కు .. విదేశీ ప్రతినిధులు

హైదరాబాద్ హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ (Novatel) వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ (Bharat Summit) జరుగుతోంది. పెట్టుబడులు (Investments), న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు, పలువురు కాంగ్రెస్ నేతలు (Congress leaders) స్వాగతం పలికారు. బోనాల డప్పులు, సాంస్కృతిక కార్యక్రమాలతో సదస్సుకు వారిని ఆహ్వానించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు విదేశీ ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు.