హైదరాబాద్ లో ఫ్లిఫ్ కార్ట్ విస్తరణకు చర్యలు

భారతదేశంలో తన వ్యాపార సామ్య్రా విస్తరణలో భాగంగా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ దేశవ్యాప్తంగా 8 లక్షల చదరపు అడుగులకు పైగా గోడౌన్ల సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. ఇందులోభాగంగా హైదరాబాద్‍లోని గోడౌన్‍ను కూడా విస్తరించనున్నది. దేశవ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్కు 15 గోడౌన్లు ఉన్నాయి. వీటిలో నిల్వసామర్థ్యం 25 లక్షల క్యూబిక్ ఫీట్లు ఉంది. హైపర్ లోకల్ సర్వీసు ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను 90 నిమిషాల్లో పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇతర మెట్రో నగరాలు కూడా ఈ సేవలో దశలవారీగా రానున్నట్లు తెలిపింది. ఫ్లిప్‍కార్ట్ జూలై 2020లో ఫ్లిప్‍కార్ట్ క్విక్ బ్యాక్‍ను ప్రవేశపెట్టింది. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, కిరాణ వస్తువులు, మొబైళ్లు, ఎలక్ట్రానిక్, శిశువు సంరక్షణ ఉత్పత్తులు 90 నిమిషాల్లో డెలివరీ చేస్తారు. ఈ డెలివరి కింద 3 వేలకుపైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు దానిని మరో ఆరు నగరాలకు విస్తరించారు.