సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దర్శకులు ఆహ్వానించారు.