TGCSB: ఆ వీడియో నమ్మెద్దు : టీజీసీఎస్‌బీ

శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఉగ్రవాది (Terrorist) పట్టుబడినట్టు సోషల్ మీడియా (Social media )లో ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్న వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే, దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) (TGCSB)అధికారులు స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వీడియో (Fake video) అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్ధారించారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. అధికారులు ద్రువీకరించని నకిలీ వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.