హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి మాడ్యులర్ ఫర్నిచర్ తయారీ కేంద్రం ఏర్పాటుచేసిన ఫాబియెన్స్ (Fabience)
అత్యున్నత శ్రేణి మాడ్యులర్ కిచెన్స్ మరియు వార్డ్రోబ్స్ కోసం బీ2బీ మార్కెట్లో ప్రవేశించిన ఫాబియెన్స్
ఆర్టీఏ (రెడీ టు అసెంబల్) ఫార్మాట్లో అత్యున్నత శ్రేణి కిచెన్స్ మరియు వార్డ్రోబ్స్ను అందించే అత్యాధునిక మాడ్యులర్ ఫర్నిచర్ సొల్యూషన్స్ కంపెనీ, ఫాబియెన్స్. ఈ మాడ్యులర్ కిచెన్స్ మరియు వార్డ్రోబ్స్ను ఇటాలియన్ మరియు జర్మన్ మెషినరీ కలిగిన వారి అత్యాధునిక యూనిట్ వద్ద తయారుచేస్తారు. వారి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి, ఫాబియెన్స్ తమ సామర్ధ్యంను విస్తరిస్తూ హైదరాబాద్‌లోని మెడికల్ డివైజస్ పార్క్ వద్ద ఈ నూతన తయారీ కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ నూతన తయారీ కేంద్రాన్ని 4 ఎకరాల విస్తీర్ణంలో 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో అత్యాధునిక యూరోపియన్ యంత్రసామాగ్రితో ఏర్పాటుచేశారు. ఫాబియెన్స్ తమ ఉత్పత్తి శ్రేణిని విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. అంతేకాదు బీ2బీ విభాగంలో ప్రవేశించడం ద్వారా భారతదేశంలో కస్టమ్ మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్ కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చనుంది.
తుది వినియోగదారు కస్టమర్ కేంద్రీకృత సంస్ధ ఫాబియెన్స్. ఇది సాంకేతిక ఆధారిత ఇంటీరియర్ డిజైన్ వినియోగించడంతో పాటుగా కిచెన్స్కోసం ప్రీమియం ఫినీషింగ్స్ మరియు వార్డ్రోబ్స్ను విస్తృత శ్రేణి కస్టమ్ డిజైన్ పరిష్కారాలతో అందిస్తూ, విశ్వసనీయత మరియు సౌకర్యం ద్వారా వినియోగదారులకు విలువను సృష్టిస్తుంది. అత్యుత్తమ ప్రక్రియలు, పారదర్శకతను అనుసరించడం ద్వారా పరిశ్రమలో ఈ కంపెనీ తమకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సృష్టించుకుంటుంది. ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లైన్‌ను కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్‌తో ఆటోమేట్ చేశారు. డిజైన్ నేపథ్యం నుంచి ఫైనల్ ప్రొడక్షన్ వరకూ వినియోగదారుల సౌందర్య అవసరాలను ఇది తీర్చనుంది. ఈ కంపెనీకి ఇప్పటికే హైదరాబాద్‌లోని గండిమైసమ్మ వద్ద ఓ తయారీ కేంద్రం ఉంది.
ఈ సందర్భంగా ఫాబియెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టీ ఆర్ వేణు గోపాల్ మాట్లాడుతూ ‘‘పారదర్శకత, అమలు, డెలివరీ అనేవి కీలక సిద్ధాంతాలుగా కలిగిఉండటంతో పాటుగా ఈ స్థాయి పారదర్శకతకు ధృవీకరిస్తూ ఫాబియెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మేము ఈ రంగంలో ఓ సముచిత స్ధానంలో ఉంటూ అత్యున్నత శ్రేణి కిచెన్స్ మరియు వార్డ్రోబ్స్ను ఆర్టీఏ ఫార్మట్‌లో తుది వినియోగదారుల ఇంటీరియర్ అవసరాలను తీరుస్తున్నాము. వినియోగదారులు ఏ సమయంలో అయినా మా ఫ్యాక్టరీని సందర్శించడంతో పాటుగా మెటీరియల్ ఎంపిక దగ్గర నుంచి తమ ఆర్డర్‌కు అనుగుణంగా ఫినీష్డ్ ఉత్పత్తిని పొందడం వరకూ వీక్షించవచ్చు. ఇది మా కార్యకలాపాల పట్ల వారికి నమ్మకం మరింతగా పెంచడంతో పాటుగా రిఫరల్స్ ద్వారా మా వ్యాపారం మరింతగా పెరిగేందుకు సైతం తోడ్పడుతుంది.
ఇంటీరియర్ పరిశ్రమలో చిన్న స్ధానిక ఆపరేటర్లు మరియు ఫ్రీలాన్సర్లు అధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వల్ల ప్రొఫెషనల్ మరియు పారదర్శక, ఆధారపడతగిన ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రదాతల కోసం రెసిడెన్షియల్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయి. మా ప్రస్తుత విస్తరణ పరిశ్రమ కోసం అత్యున్నత శ్రేణి మాడ్యులర్ కిచెన్స్ మరియు వార్డ్రోబ్ స్పేస్‌లో సాంకేతిక ఆధారిత, ప్రాసెస్ డ్రివెన్, అత్యున్నత నాణ్యత కలిగిన సేవలను అందించడం ద్వారా ఈ అవకాశాలను ఒడిసి పట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. మా విస్తృతశ్రేణి పరిజ్ఞానంపై ఆధారపడటంతో పాటుగా ప్రస్తుత బీ2సీ మాడ్యుల్ నుంచి మా కార్యకలాపాలను విస్తరించడం ద్వారా భారతదేశంతో పాటుగా విదేశాలలో సైతం బీ2బీ రంగంలో వినూత్నమైన మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్ పరిష్కారాల కోసం కీలక ప్రదాతగా మారాలని కోరుకుంటున్నాం.
ఈ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు మేము విస్తృతంగా యూరోప్‌లో పర్యటించడంతో పాటుగా నూతన ధోరణులను స్వీకరించి, అత్యాధునిక సాంకేతికతను తీసుకువచ్చాము. తద్వారా యంత్రసామాగ్రిని ఆధునీకరించడంతో పాటుగా డిజైనింగ్, తయారీలో సామర్ధ్యం మెరుగుపరుచుకున్నాము మరియు మాడ్యులర్ కిచెన్స్ మరియు వార్డ్రోబ్స్ను నిర్ధిష్టమైన, ప్రీ కమిటెడ్ టైమ్‌లైన్స్‌లో అందించడం చేస్తున్నాము. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడంలో భాగంగా అత్యున్నత శ్రేణి ముడి పదార్థాలను మేము వినియోగించుకుంటున్నాము. అలాగే మేము జీరో వ్యర్థాల విధానం అనుసరిస్తున్నాము. తద్వారా నిలకడైన వ్యాపార మరియు డస్ట్ ఫ్రీ వాతావరణమూ సృష్టిస్తున్నాము. వినియోగదారులపై మేము దృష్టి కేంద్రీకరించాము. వారు మాతో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉంటారు. ఈ నూతన ప్రాంగణంలో మేము 5 అంతస్థుల భవనాలను – 50000 చదరపు అడుగుల లివింగ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నాము. ఇతర సదుపాయాలతో పాటుగా మా ఉద్యోగుల కోసం ఫాబియెన్స్ వద్ద వసతి సౌకర్యాలూ అందిస్తున్నాము’’అని అన్నారు.
ఫాబియెన్స్ గురించి :
విస్తృతశ్రేణిలో కిచెన్ శైలిలు, మెటీరియల్స్, ఫినీషెస్ను ఫాబియెన్స్ అందిస్తుంది. వీటిలో చాలా వరకూ డిజైన్లను ప్రత్యేకంగా మా ఖాతాదారుల కోసం అంతర్గతంగా డిజైన్ చేసి అందిస్తుంటాం. మా వినియోగదారులకు కేవలం అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు మాత్రమే కాదు, అత్యున్నత విలువ కలిగిన ఉత్పత్తులను అందించడానికి ఫాబియెన్స్ కృషి చేస్తోంది. ఇది అత్యంత పారదర్శకమైన ప్రక్రియను మెటీరియల్స్ ఎంపిక దగ్గర నుంచి తుది ఫినీషెస్, డెలివరీ వరకూ అందిస్తుంది. ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లైన్ కంప్యూటరైజ్డ్ కావడం చేత డిజైన్ నేపథ్యం మొదలు తుది ఉత్పత్తి వరకూ పూర్తిగా కంప్యూటర్ సహాయం తీసుకుంటారు. ఈ కారణం చేత వినియోగదారుల సౌందర్య అవసరాలకు తగినట్లుగా పూర్తి సౌకర్యం, అనుకూలీకరణ సాధ్యమవుతుంది.
Follow us at:
For more details, please contact: Konnections IMAG
Sunil Kumar M: 9866520337 / Anand: 8309129428






